స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పటికే వీరి కలయికలో సరైనోడు సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఐతే, బన్నీ కోసం బోయపాటి ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను ఆల్ రెడీ పూర్తి చేశాడని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా కథ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. బన్నీ తో బోయపాటి చేస్తున్న కథా నేపథ్యం పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో సాగుతుంది అని, మెయిన్ కథాంశమే నీరు చుట్టూ ఉంటుందని.. మొత్తానికి బన్నీ – బోయపాటి నుంచి మరో పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో ఎప్పటి లాగే బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ మాత్రం ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా స్టార్ట్ అవుతుంది. ఆల్ రెడీ ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించారు. దీంతో, జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, మరియు అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మరోసారి జత కట్టినట్టు అయ్యింది. ఇక ఈ సినిమా పూర్తి అయ్యాక బన్నీ – బోయపాటి సినిమా ఉంటుంది.