సమీక్ష : బ్రహ్మ ఆనందం – కేవలం కొన్ని సీన్స్ కోసం మాత్రమే

Brahma Anandam Movie Review In Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 14, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : రాజా గౌతమ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమని, ఐశ్వర్య హోలక్కల్, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, రఘు బాబు, ప్రభాకర్, డివిజ ప్రభాకర్, దయానంద్ రెడ్డి మరియు ఇతరులు

దర్శకుడు :ఆర్ వి ఎస్ నిఖిల్

నిర్మాత : రాహుల్ యాదవ్ నక్కా

సంగీతం :శాండిల్య పిసపాటి

సినిమాటోగ్రఫీ :మితేష్ పర్వతనేని

ఎడిటర్ :ప్రణీత్ కుమార్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

టాలీవుడ్ మీమ్ గాడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం అలాగే తన కొడుకు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “బ్రహ్మ ఆనందం”. మంచి ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

సినిమాల్లో రాణించాలని కోరుకునే బ్రహ్మ(రాజా గౌతమ్) ఒక మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జూనియర్ ఆర్టిస్ట్ నుంచి మంచి నటుడుగా పేరు తెచ్చుకోవాలనే ఆశతో పాటుగా తనకి ఉన్న ఆర్ధిక ఇబ్బందులు కూడా ఎక్కువవుతూ ఉంటాయి. ఇలా తనకి ఒక లైఫ్ ఛేంజింగ్ ఆఫర్ వస్తుంది కానీ దానికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అవుతాయి. అయితే ఈ డబ్బులు కోసం ఒక వృద్ధాశ్రమంలో ఉంటున్న తన తాత ఆనంద్ రామమూర్తి (బ్రహ్మానందం) సాయం చేస్తాను అంటారు. కానీ ఇక్కడ నుంచి కథ ఎలా మలుపు తిరిగింది? ఆనంద్ బ్రహ్మని ఎందుకు బుర్రడుపాలెం తీసుకొస్తారు? బ్రహ్మ తాను కోరుకున్నట్టుగా నటుడిగా రాణించాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందమే అని చెప్పవచ్చు. ఇన్నాళ్లు పలు కామెడి రోల్స్ లో ఆయన్ని చూసినప్పటికీ తన నుంచి వచ్చే కొన్ని సీరియస్ అండ్ ఎమోషనల్ పాత్రల్లో ఎంతో కదిలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి కదిలించిన కొన్ని పాత్రల్లో ఈ సినిమా లోనిది కూడా ఒకటి అని చెప్పవచ్చు.

తన డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ నటన చూసే ఆడియెన్స్ ఎంతగానో ఎమోషనల్ గా అనిపిస్తాయి. అలాగే గౌతమ్ కూడా ఈ సినిమాలో మరో ప్లస్ అని చెప్పవచ్చు. చాలా తక్కువ సినిమాలే తాను చేసినప్పటికీ నటుడుగా తనలోని ఫుల్ పొటెన్షియల్ ఈ సినిమాలో కనిపించినట్టుగా అనిపిస్తుంది. తన కామెడి టైమింగ్ సహా పలు ఎమోషనల్ సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి.

ఇక లెజెండ్ బ్రహ్మానందంతో పాటుగా మరో టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఈ సినిమాలో భాగమయ్యాడు. తన పార్ట్ ఈ సినిమాలో అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. మంచి కామెడీ టైమింగ్ తో కొన్ని సన్నివేశాల్లో మంచి హాస్యం పండించారు. వీరితో పాటుగా ప్రియా వడ్లమని, దివిజ ప్రభాకర్, సంపత్ రాజ్ అలాగే రాజీవ్ కనకాల తదితరులు తమ పాత్రల్లో బాగా నటించారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో ప్రామిసింగ్ కథాంశం ఉంది కానీ దానిని ఎంగేజింగ్ గా నడపడంలో మాత్రం తడబడుతుంది అని చెప్పాలి. ఎప్పుడైతే కథ ఆ విలేజ్ కి స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి సినిమా బాగా నెమ్మదిస్తున్నట్టు అనిపిస్తుంది. సీన్స్ అన్నీ చాలా పేలవంగా సాగదీస్తున్నట్టుగా వెళుతుంటాయి.

మెయిన్ గా స్క్రీన్ ప్లే సినిమాలో వీక్ గా అనిపిస్తుంది. ఇంకా ఎమోషన్స్ లో మరింత డెప్త్ ఉన్నట్టు అయితే మరికొన్ని సీన్స్ ఇంకా బెటర్ గా అనిపించేవి. అలాగే బ్రహ్మ మరియు ఆనంద్ రామ్ మూర్తి నడుమ ఎమోషనల్ బాండ్ సంబంధిత సన్నివేశాలతో మొదట బాగానే అనిపిస్తుంది కానీ తర్వాత అది బలహీనంగా మారుతున్నట్టుగా అనిపిస్తుంది.

దీనితో వారి నడుమ సన్నివేశాలు ఇంకా స్ట్రాంగ్ గా డిజైన్ చేసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అలాగే ఇంకొంతమంది ముఖ్య నటుల్ని సరిగ్గా వాడుకోలేదు అనిపిస్తుంది. అలాగే కొన్ని కీలక సన్నివేశాలు ఇంకా హైలైట్ చేయాల్సింది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగున్నాయి. అలాగే టెక్నీకల్ పరంగా కూడా ఈ చిత్రం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తాయి. సంగీతం చాలా సన్నివేశాలకి హెల్ప్ అయ్యింది. అలాగే సినిమాటోగ్రఫీ, డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ మాత్రం బెటర్ గా చేయాల్సింది. మెయిన్ గా సెకండాఫ్ లో సినిమా బాగా డిజైన్ చేయాల్సింది.

ఇక దర్శకుడు ఆర్ వి ఎస్ నిఖిల్ విషయానికి వస్తే.. తాను ఈ సినిమాకి తీసుకున్న నేపథ్యం ఫ్రెష్ గా అనిపిస్తుంది. అలాగే కొంతమేర ప్రొసీడింగ్స్ కూడా ఇంప్రెస్ చేస్తాయి కానీ కథనం మాత్రం ఉండగా నెమ్మదిగా డల్ అయ్యిపోతుంది. స్లో గా సాగే కథనం, సినిమాని పలుచగా మార్చింది. తాను ఇంకా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకొని ఉంటే బాగుండేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “బ్రహ్మ ఆనందం”లో లైన్ బాగుంది. అలాగే బ్రహ్మానందం, గౌతమ్ సహా వెన్నెల కిషోర్ లు తమ నటనలతో నవ్విస్తారు, ఎమోషనల్ గా కూడా కదిలిస్తారు. కానీ ఓవరాల్ సినిమాలో ఎమోషనల్ డెప్త్ పూర్తి స్థాయిలో కనిపించదు. అలాగే ఉండగా ఉండగా కథనం కూడా పలుచగా మారినట్టు అనిపిస్తుంది. వీటితో ఈ సినిమా కొన్ని ఎమోషన్స్ వరకు ఓకే అనిపిస్తుంది. ఈ సినిమాని చూడాలి అనుకునేవారు మాత్రం తక్కువ అంచనాలతో ఎక్కువ ఓపికతో ట్రై చేస్తే బెటర్.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version