మన టాలీవుడ్ లెజెండ్ హాస్య బ్రహ్మ బ్రహ్మనందం అలాగే తన నట వారసుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆర్విఎస్ నిఖిల్ తెరకెక్కించిన బ్యూటిఫుల్ చిత్రం “బ్రహ్మ ఆనందం” కోసం అందరికీ తెలిసిందే. అయితే మంచి ప్రమోషన్స్ ని జరుపుకున్న ఈ సినిమా డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ కి వచ్చింది. ఇక ఈ సినిమా థియేటర్స్ రన్ తర్వాత ఓటిటిలో రిలీజ్ కి ఆల్రెడీ రావాల్సి ఉంది.
ఈ మార్చ్ 14నుంచే ఆహా లో రావాల్సిన ఈ చిత్రం నేడు ఇందులో రావడం వాయిదా పడింది. అయితే ఈ సినిమాకి ఇపుడు కొత్త డేట్ ఫిక్స్ అయ్యింది. ఇదే ఆహాలో ఈ చిత్రం మార్చ్ 19 నుంచి అందుబాటులోకి రానున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. సో కామెడీ కింగ్ బ్రహ్మానందం అభిమానులు అపుడు థియేటర్స్ లో మిస్ అయితే ఇపుడు మార్చ్ 19 వరకు ఆగితే సరిపోతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి శాండిల్య పీసపాటి సంగీతం అందించగా స్వధరం ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.