‘ఓ పిట్టకథ’కి.. ఎన్టీఆర్ బెస్ట్ విషెస్ !

‘ఓ పిట్టకథ’కి.. ఎన్టీఆర్ బెస్ట్ విషెస్ !

Published on Mar 5, 2020 5:59 PM IST

విశ్వంత్‌ దుద్దంపూడి, సంజయ్‌ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేషన్స్ పతాకం ఫై వి.ఆనందప్రసాద్‌ నిర్మించారు . చెందు ముద్దు దర్శకుడు. రేపు విడుదలవుతోంది. కాగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకి టీమ్ కి విష్ చేస్తూ ట్వీట్ చేశారు. సంజయ్ అండ్ నా ఫ్రెండ్ బ్రహ్మాజీకి అలాగే ‘ఓ పిట్టకథ’ చిత్రబృందానికి బెస్ట్ విషెస్. రేపే ఈ సినిమా విడుదల అవుతుంది’ అని పోస్ట్ చేశారు. ఇప్పటికే చాలమంది సినీ ప్రముఖులతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేశారు.

కాగా లవ్ స్టోరీతో పాటు సప్సెన్స్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో బాగుంటాయని తెలుస్తోంది. వి.ఆనందప్రసాద్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజ‌య్ రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఒక విలేజ్‌లో జ‌రిగే స్టోరీ నేప‌థ్యంలో న‌డుస్తుందని… ప్ర‌తి స‌న్నివేశం స్వ‌చ్ఛంగా సాగుతూనే క‌డుపుబ్బ న‌వ్విస్తుందని చెబుతుంది చిత్రబృందం. మ‌రోవైపు ఏం జ‌రుగుతోంద‌నే ఉత్కంఠ‌ను రేకెత్తిస్తుందట. ప‌తాక స‌న్నివేశాల వ‌ర‌కూ ఆ థ్రిల్లింగ్ అలాగే స‌స్టైన్ అవుతుందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు