ఈసారి ఆ కంటెంట్ తో రానున్న బ్రహ్మాజీ వారసుడు..!

ఈసారి ఆ కంటెంట్ తో రానున్న బ్రహ్మాజీ వారసుడు..!

Published on Jul 15, 2020 8:29 PM IST


మాన టాలీవుడ్ లో సీనియర్ నటుడు బ్రహ్మాజీ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఎందరో స్టార్ హీరోలతో కలిసి నటించిన బ్రహ్మజీ ఇటీవలే తన కొడుకు సంజయ్ ను కూడా తెలుగు తెరకు హీరోగా పరిచయం చేసారు. “ఓ పిట్ట కథ” అనే సినిమాతో హీరోగా పరిచయం కాబడిన సంజయ్ ట్రెండ్ ఫాలో అవుతూనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తోనే ఎంట్రీ ఇచ్చాడు.

అయితే దీని తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో కూడా ఓ చిన్నపాటి బడ్జెట్ సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమా తొందరలోనే మొదలు కానున్నట్లు తెలుస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ తో హీరోగా పరిచయం అయిన ఈ హీరో ఈసారి అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ తో రావడానికి ఈ యువ హీరో సిద్ధం అవుతున్నాడట.

ప్రముఖ దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ కూడా ఈ చిత్రంలో సంజయ్ తో కలిసి నటించనున్నాడట. విశాఖ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ త్వరలో మొదలు కావడానికి రెడి అవుతున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు