‘శ్రీమంతుడు’ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నూతన ఉత్సాహంతో ‘బ్రహ్మోత్సవం’ సినిమాని చక చకా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. అందులో భాగంగానే మహేష్ బాబు ఇప్పటికే 3 షెడ్యూల్స్ ని ఫినిష్ చేసాడు. ఇటీవలే ఓ 15 రోజుల ఊటీ షెడ్యూల్ ఫినిష్ చేసిన మహేష్ బాబు ప్రస్తుతం న్యూ ఇయర్ హాలిడే కోసం అబ్రాడ్ వెళ్ళాడు. ఈ షెడ్యూల్ ఫినిష్ చేసే టైంలోనే మహేష్ బాబు అభిమానులకి న్యూ ఇయర్ గిఫ్ట్ గా బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్ టీజర్ ని నూతన సంవత్సర కానుకగా జనవరి 1వ తేదీన రిలీజ్ చేయడానికి శ్రీకారం చుట్టాడని ఇది వరకే తెలియజేశాం.
తాజాగా ఈ చిత్ర టీం ఈ ఫస్ట్ టీజర్ కోసం ఓ స్పెషల్ ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది. జనవరి 1వ తేదీ ఉదయం 9:36 నిమిషాలకు రిలీజ్ చేయాలని ఫిక్స్ చేసారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ టీం ఫస్ట్ టీజర్ కి ఫైనల్ వెర్షన్ కి తుది మెరుగులు దిద్దుతోంది. జనవరి మొదటి వారం చివరి నుంచి హైదరబాద్ లో మరో షెడ్యూల్ ని మొదలు పెడతారు. ఆ షెడ్యూల్ లో సమంత కూడా జాయిన్ అవుతుంది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. పివిపి బ్యానర్ వారు ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు.


