బ్రహ్మానందంలో మనకు తెలియని టాలెంట్.

Published on Aug 5, 2020 8:44 pm IST

కామెడీ పంచడంలో బ్రహ్మానందాన్ని మించినోడు ఈ ప్రపంచంలో లేడంటే అతిశయోక్తి కాదు. హాస్యానికి చిరునామాగా ఆయన్ని చెప్పుకుంటారు. కొన్నాళ్లుగా ఆరోగ్యకారణాల రీత్యా ఆయన సినిమాలు తగ్గించారు. ఒకప్పుడు బ్రహ్మానందం లేని సినిమా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. ఇక స్టార్ హీరోల సినిమాలలో కూడా బ్రహ్మానందం కోసం ఓ సపెరేట్ కామెడీ ట్రాక్ ఉండాల్సిందే. ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు హోల్డర్ దగ్గర మనకు తెలియని మరో కళ కూడా ఉంది.

బ్రహ్మానందం గొప్పగా చిత్రాలు గీస్తారు. నేడు బ్రహ్మానందం శ్రీరాముడు, ఆంజనేయుడు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న చిత్రాన్ని గీశారు. బ్రహ్మానందం గీసిన ఆ పెన్సిల్ ఆర్ట్ అద్భుతంగా ఉంది. నేడు అయోధ్యలో రామమందిర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని బ్రహ్మనందం ఆ బొమ్మ గీయడం జరిగింది. ప్రస్తుతం బ్రహ్మానందం కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో కీలక రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More