బ్రేకింగ్ : సింగరేణి ఉదంతుడు ఆత్మహత్య..వివరాలు ఇవే.!

Published on Sep 16, 2021 11:29 am IST


గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన దారుణ ఘటన తెలంగాణా సింగరేణి ప్రాంతానికి చెందిన ఆరేళ్ళ చిన్నారి హత్యాచార కేసు.. మరి ఈ కేసులో ప్రధాన నిందితుడు అయినటువంటి రాజు అనే వ్యక్తి పరారీలో ఉండగా తెలంగాణా పోలీసు శాఖ వారు తీవ్ర గాలింపులు కూడా చేపట్టారు. మరి ఈ ఉదంతానికి బలైన చిన్నారి కుటుంబానికి అండగా టాలీవుడ్ తారలు కూడా అండగా నిలిచారు.

నిన్ననే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వెళ్లి వారిని పరామర్శించారు. అయితే ఈ తర్వాత సమయంలోనే ఆ ఉదంతుడు బయట తిరగడం ఓ సీసీ కెమెరాలో రికార్డు అవ్వడం విజువల్ వైరల్ అవ్వడం మొదలు కాగా బ్రేకింగ్ వార్త ఇప్పుడు బయటకి వచ్చింది. ఈ దారుణ ఘటనకు కారకుడు అయినటువంటి ఈ రాజు ఆత్మ హత్య చేసుకున్నట్టుగా ఇపుడు ఖరారు అయ్యింది.

వరంగల్ జిల్లా ఘన్ పూర్ రైల్వే ట్రాక్ దగ్గర అతడు ఆత్మహత్య చేసుకోగా వాడి శరీరం దొరికింది. అంతే కాకుండా ఆ దేహంపై పోలీసులు ఏవైతే గుర్తులు చెప్పారో అవన్నీ ఉండడంతో దీనితో అతడు ఆత్మహత్యకి పాల్పడ్డాడు అని కన్ఫర్మ్ అయ్యింది. దీనితో ఈ కేసుకి ముగింపు ఇలా వచ్చింది. అలా కాకుండా ప్రజలకు కానీ దొరికి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :