ఓటీటీ స‌మీక్ష : బృంద – త్రిష తొలి తెలుగు వెబ్ సిరీస్

Brinda Movie Review in Telugu

విడుదల తేదీ : ఆగస్టు 02, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: త్రిష‌, ఇంద్ర‌జిత్ సుకుమారన్, జ‌య ప్ర‌కాశ్, ఆమ‌ని, ర‌వీంద్ర విజ‌య్, ఆనంద్ సామి, రాకెండు మౌళి త‌దితరులు

దర్శకులు: సూర్య మ‌నోజ్ వంగ‌ల‌

నిర్మాతలు : కొల్ల ఆశిష్

సంగీత దర్శకుడు: శ‌క్తికాంత్ కార్తిక్

సినిమాటోగ్రఫీ: దినేష్ కె బాబు

ఎడిట‌ర్ : అన్వ‌ర్ అలీ

సంబంధిత లింక్స్: ట్రైలర్

స్టార్ బ్యూటీ త్రిష తొలిసారి న‌టించిన వెబ్ సిరీస్ బృంద ఎట్ట‌కేల‌కు ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో నేడు స్ట్రీమింగ్ కి వ‌చ్చేసింది. చాలారోజులుగా ఆస‌క్తిని క్రియేట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ సమీక్ష‌లో చూద్దాం.

 

క‌థ:

హైద‌రాబాద్ లో పోలీస్ సూప‌రింటెండెంట్ అయిన బృంద‌(త్రిష‌) ఓ వ్యక్తి మ‌ర‌ణాన్ని ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించ‌డంతో అనుమానం వ్య‌క్తం చేస్తుంది. ఆమె ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసేందుకు నిశ్చ‌యించుకుంటుంది. ఈ ఇన్వెస్టిగేష‌న్ లో ఆమెకు ప‌లు మ‌ర‌ణాలకు గ‌ల వాస్త‌వాలు తెలుస్తాయి. వీట‌న్నింటినీ ఒక హంతకుడు చేస్తున్నాడ‌ని ఆమె కనుగొంటుంది. అస‌లు ఈ మ‌ర‌ణాల వెనకాల ఉన్న‌ది ఎవ‌రు? అత‌డు ఈ హ‌త్య‌లు ఎందుకు చేస్తున్నాడు..? ఈ కేసును బృంద అంత ఆస‌క్తిగా ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తుంది? వీట‌న్నింటికీ స‌మాధాన‌మే బృంద వెబ్ సిరీస్.

 

ప్ల‌స్ పాయింట్స్:

తన తొలి వెబ్ సిరీస్ కోసం క‌థ ఎంపిక‌లో త్రిష చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రించింది. ఓ చ‌క్క‌టి క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ ను ఎంచుకోవ‌డం ఆమె బెస్ట్ ఛాయిస్. నిజాయితీగ‌ల పోలీస్ ఇన్స్పెక్ట‌ర్ గా త్రిష చాలా అల‌వోక‌గా న‌టించింది. అన్ని ర‌కాల ఎమోషన్స్ ను త‌న పాత్ర‌లో త్రిష చ‌క్క‌గా క్యారీ చేసింది.

రవీంద్ర విజ‌య్ కూడా సార‌థి అనే పాత్ర‌లో చ‌క్క‌టి ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇన్వెస్టిగేష‌న్ లో భాగంగా త్రిష‌కు ఎల్ల‌ప్పుడూ సాయం చేసే పాత్ర‌లో అత‌డు న‌టించాడు. ఆనంద్ సామి ప‌ర్ఫార్మెన్స్ కూడా సాలిడ్ గా ఉంది. అత‌డి ఎక్స్ ప్రెష‌న్స్ ఈ వెబ్ సిరీస్ కి మ‌రింత డెప్త్ ను తీసుకొచ్చాయి.

రాకెండు మౌళి, ఇంద్ర‌జిత్, జ‌య‌ప్ర‌కాశ్ లు కూడా మంచి న‌ట‌న‌ను క‌న‌బరిచారు. మిగ‌తా న‌టీన‌టులు కూడా త‌మ పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు.

ఈ వెబ్ సిరీస్ మొద‌ల‌వ‌డంతోనే ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ట్టుకుంటుంది. మొద‌టి నాలుగు ఎపిసోడ్స్ ఆడియెన్స్ లో ఆస‌క్తిని క్రియేట్ చేస్తాయి. స్క్రీన్ ప్లే, స‌స్పెన్స్, ప్ర‌తి ఎపిసోడ్ చివ‌ర్లో వ‌చ్చే మ‌లుపులు చక్క‌గా ఉండ‌టంతో దీనిని మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారుస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చ‌క్కగా కుదిరింది.

 

మైన‌స్ పాయింట్స్:

ఈ వెబ్ సిరీస్ లోని హింసాత్మ‌క స‌న్నివేశాలు కొన్ని వ‌ర్గాల ఆడియెన్స్ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయ‌క‌పోవ‌చ్చు.

చాలా ఎపిసోడ్స్ లో స్క్రీన్ ప్లే బ‌లంగానే ఉంటుంది. కానీ, కొన్ని సీన్స్ చాలా నెమ్మ‌దిగా సాగ‌డం ఒకింత‌ చిరాకును తెప్పిస్తాయి. హంత‌కుడి ఫ్లాష్ బ్యాక్ పై ఎక్కువ‌గా ఫోకస్ పెట్టిన‌ట్లుగా అనిపిస్తుంది. ఈ సీన్స్ ను కుదించి ఉండ‌వ‌చ్చు. విల‌న్ ఎవ‌రో రివీల్ అయ్యాక‌, ద‌ర్శ‌కుడు క‌థ‌ను కాస్త స్పీడుగా తీసుకెళ్లాల్సింది.

హంతకుడి మోటో ఏమిటో చ‌క్క‌గా చూపెట్టారు. కానీ, కొన్ని సీన్స్ లో ఎమోష‌న‌ల్ ఇంపాక్ట్ ముఖ్యంగా చివ‌రి ఎపిసోడ్ లో ఇంకాస్త బ‌లంగా ఉండాల్సింది. ఈ వెబ్ సిరీస్ 8 కాకుండా 6 ఎపిసోడ్స్ గా కుదించి ఉంటే మ‌రింత ప్ర‌భావ‌వంతంగా ఉండేది.

 

సాంకేతిక విభాగం:

ఈ వెబ్ సిరీస్ కి ప‌నిచేసిన సాంకేతిక విభాగం ప‌నితీరు బాగుంది. సినిమాటోగ్ర‌ఫీ, మ్యూజిక్, నిర్మాణ విలువ‌లు చాలా చ‌క్క‌గా ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త బెట‌ర్ గా ఉండాల్సింది. చాలా సీన్స్ ను ట్రిమ్ చేసి ఉండాల్సింది.

ద‌ర్శ‌కుడు సూర్య మ‌నోజ్ వంగ‌ల ఓ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ ను ఈ వెబ్ సిరీస్ తో అందించాడు. ప‌ద్మావ‌తి మ‌ల్ల‌డి స్క్రీన్ ప్లే చాలా ఇంప్రెసివ్ గా సాగింది.

 

తీర్పు:

ఓవ‌రాల్ గా ఇటీవ‌ల రిలీజైన వెబ్ సిరీస్ ల‌లో బృంద ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎంగేజింగ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా ఇది ఆద్యంతం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. త్రిష‌, ఆనంద్ సామి, ఇంద్ర‌జిత్ ర‌వీంద్ర విజ‌య్ ల అద్భుత ప‌ర్ఫార్మెన్స్ తో పాటు సూర్య మ‌నోజ్ వంగ‌ల ద‌ర్శ‌కత్వం ఈ వెబ్ సిరీస్ ను ఆస‌క్తిక‌రంగా మ‌లిచింది. కొన్ని అభ్యంత‌క‌ర స‌న్నివేశాలు, లాంగ్ ర‌న్ టైమ్, కొన్ని ల్యాగ్ సీన్స్ మిన‌హాయిస్తే.. క్రైమ్ థ్రిల్ల‌ర్స్ ఇష్ట‌ప‌డేవారికి బృంద ఓ చ‌క్క‌టి ఛాయిస్ అని చెప్పాలి.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version