ఇంట్రడక్షన్ సాంగ్ కి స్టెప్స్ మొదలెట్టిన రామ్ చరణ్

ఇంట్రడక్షన్ సాంగ్ కి స్టెప్స్ మొదలెట్టిన రామ్ చరణ్

Published on Sep 7, 2015 1:01 PM IST

brusli
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 9వ సినిమా ‘బ్రూస్ లీ’. ‘ది ఫైటర్’ అనే ఈ సినిమాకి ట్యాగ్ లైన్. ‘గోవిందుడు అందరివాడేలే’ లాంటి ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ కి శ్రీను వైట్ల డైరెక్టర్. గత కొద్ది రోజులుగా గ్యాప్ లేకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు. దాంతో 85% టాకీ పార్ట్ పూర్తయ్యింది. కంటిన్యూగా సీన్స్ షూట్ చేసిన ఈ చిత్ర టీం టాకీ పార్ట్ కి కాస్త గ్యాప్ ఇచ్చి సాంగ్ షూట్ మీదకి షిఫ్ట్ అయారు.

ఈ రోజు నుంచి రామ్ చరణ్ పై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఈ పాట కోసం అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఓ స్పెషల్ సెట్ ని కూడా వేసారు. జానీ మాస్టర్ ఈ సాంగ్ కి స్టెప్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఫాస్ట్ బీట్ తో సాగే ఈ సాంగ్ కి జానీ మాస్టర్ సూపర్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నాడని సమాచారం. మరో 4 రోజుల పాటు అక్కడే ఈ సాంగ్ షూట్ జరగనుంది. ఈ సాంగ్ షూట్ ఫినిష్ చేసాక మళ్ళీ ఈ చిత్ర టీం టాకీ పార్ట్ మీదకి ఫోకస్ ని షిఫ్ట్ చేస్తుంది. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా సెట్లో జాయిన్ కానున్నాడు.

రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కృతి కర్భంద, నదియా, రావు రమేష్, సంపత్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ చివర్లో ఆడియోని రిలీజ్ చేసి సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు