పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన సేనాపతి…ఇంట్రెస్టింగ్ గా “భారతీయుడు 2” ట్రైలర్!

పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన సేనాపతి…ఇంట్రెస్టింగ్ గా “భారతీయుడు 2” ట్రైలర్!

Published on Jun 25, 2024 7:17 PM IST

యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇండియన్ 2. తెలుగులో భారతీయుడు 2 గా జూలై 12, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్.

ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. హీరో సిద్ధార్థ్ ఇందులో కీలక పాత్రలో కనిపించారు. దేశంలో ఉన్న పరిస్థితుల రీత్యా, సేనాపతి రాక అనివార్య అని ప్రజలు అంతా భావిస్తారు. అప్పుడు సేనాపతి ఎంట్రీ ను ట్రైలర్ లో చూపించారు. కమల్ హాసన్ ఈ చిత్రం లో మరోసారి తన సాలిడ్ పెర్ఫార్మెన్స్ ను ఇచ్చినట్లు తెలుస్తోంది. ట్రైలర్ లో యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటుగా, కరప్షన్ కి సంబందించిన సన్నివేశాలను కూడా చూపించారు. ట్రైలర్ వేరే లెవెల్లో ఉంది.

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, SJ సూర్య, సముద్రఖని, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు