సమీక్ష : “బబుల్ గమ్” – స్లోగా సాగే రొటీన్ లవ్ స్టోరీ !

Bubblegum Movie Review in Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 29, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష వర్ధన్, అను హాసన్ తదితరులు

దర్శకుడు : రవికాంత్ పేరేపు

నిర్మాతలు: మహేశ్వరి మూవీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ

సంగీతం: శ్రీ చరణ్ పాకాల

సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు

ఎడిటర్లు: రవికాంత్ పేరు, కె బాలకృష్ణ రెడ్డి, బాలు మనోజ్ డి, సెరి-గన్ని

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

రోషన్ కనకాల హీరోగా మానస చౌదరి హీరోయిన్‌ గా నటించిన సినిమా ‘బబుల్ గమ్’. దర్శకుడు రవికాంత్ పేరేపు తెరకెక్కించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

ఆది (రోషన్ కనకాల) హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన పక్కా హైదరాబాదీ. డీజే కావాలనేది అతని గోల్. డీజే కావడం కోసం ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేస్తూ కష్ట పడుతూ ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా పబ్ లో జాహ్నవి (మానస చౌదరి)ని చూసి ప్రేమలో పడతాడు. కానీ, జాహ్నవి ఓ పెద్దింటి అమ్మాయి. పైగా లవ్ అండ్ రిలేషన్స్ పై పెద్దగా నమ్మకం లేని అమ్మాయి. మరి ఇలాంటి అమ్మాయి – ఆ అబ్బాయి ఎలా ప్రేమలో పడ్డారు ?, అనంతరం వారి ప్రేమ కథలో చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటి ?, చివరకు ఆది – జాహ్నవి ఒకటి అయ్యారా ? లేదా ?, ఇంతకీ ఆది తన గోల్ ను రీచ్ అయ్యాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

బోల్డ్ ఎలిమెంట్స్ తో పాటు బలమైన భావోద్వేగాలతో సాగిన ఈ బబుల్ గమ్ లో బరువైన ప్రేమ కథ ఉంది. ఎమోషనల్ గా సాగే లవ్ అండ్ బోల్డ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే క్లైమాక్స్‌లో వచ్చే సీన్స్‌ కూడా బాగున్నాయి. ఇక ఈ సినిమాలో రోషన్ కనకాల పోషించిన ప్రధాన పాత్ర అయిన ఆదిత్య పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన డీజే ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు కామెడీ సీన్స్.. ఇలా మొత్తానికి బబుల్ గమ్ సినిమా కాన్సెప్ట్ అండ్ కొన్ని కామెడీ ఎలిమెంట్స్ పరంగా ఆకట్టుకుంది.

ముఖ్యంగా కొన్ని కామెడీ సీన్స్ పర్వాలేదు. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన రోషన్ కనకాల తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేరకు బాగా మెయింటైన్ చేశాడు. అలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ రోషన్ కనకాల ఈ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. హీరోయిన్ మానస చౌదరి కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించింది. అలాగే తన గ్లామర్ తో సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మరో కీలక పాత్రల్లో నటించిన హర్ష వర్ధన్ – అను హాసన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ ‘బబుల్ గమ్’ స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగుతూ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. అలాగే, సినిమాలో కాన్ ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో క్యారెక్టర్ తాలూకు జర్నీ గ్రాఫ్ కూడా బాగాలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. నిజానికి, ఈ జనరేషన్ లో ఇలాంటి ప్రేమ కథలను చూడటానికి యూత్ ఆసక్తి చూపిస్తారు. ఐతే, ఆ కంటెంట్ లో ఫ్రెష్ నెస్ తో పాటు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండాలి. ఈ సినిమాలో ఆ ఇంట్రెస్ట్ మిస్ అయ్యింది.

అయితే, దర్శకుడు పనితనం, హీరో రోషన్ నటన సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటికీ… కథ కథనాల్లో కొత్తదనం లేకపోవడం, ప్లే కూడా స్లోగా సాగడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. దీనికితోడు అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలు చాలా స్లోగా సాగుతూ విసిగిస్తాయి. మొత్తానికి ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ పర్వాలేదకున్నా.. మిగిలిన కంటెంట్ ఆసక్తికరంగా అయితే సాగలేదు.

సాంకేతిక విభాగం :

సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల సమకూర్చిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ సురేష్ రగుతు వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఈ చిత్ర నిర్మాతలు మహేశ్వరి మూవీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు:

‘బబుల్ గమ్’ అంటూ ఈ బోల్డ్ లవ్ డ్రామాలో కొన్ని ఎమోషన్స్, బోల్డ్ సీన్స్ అండ్ క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి. రోషన్ కనకాల నటన సినిమాలో ఆడియెన్స్ ను అలరిస్తుంది. ఐతే, కథ, కథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. సినిమాలోని అసలు కథకి సంబంధం లేకుండా వచ్చే కొన్ని సన్నివేశాలు బోర్ ను కలిగిస్తాయి. ఓవరాల్ గా ఈ చిత్రంలో లవ్ అండ్ బోల్డ్ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించక పోయినా యూత్ ని కొంత మేరకు ఆకట్టుకుంటాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version