లాక్ డౌన్ రివ్యూ : బుచ్చిబాబు కండ్రిగ – తెలుగు చిత్రం “ఆహా”లో ప్రసారం

లాక్ డౌన్ రివ్యూ : బుచ్చిబాబు కండ్రిగ – తెలుగు చిత్రం “ఆహా”లో ప్రసారం

Published on Aug 21, 2020 3:41 PM IST
BucchiNaidu Kandriga Review

విడుదల తేదీ : ఆగస్టు 21, 2020

123telugu.com Rating : 2.5/5

నటీనటులు : మున్నా, దృషికా చందర్, రవివర్మ, సుబ్బారావు, ప్రభావతి, పవిత్ర జయరామ్

దర్శకుడు : కృష్ణ పోలురు

నిర్మాత : పమిడిముక్కల చంద్ర కుమారి

సంగీతం : మిహిరామ్ష్

సినిమాటోగ్రఫీ : రామ్ కె మహేసన్

ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్

 

ఈ లాక్ డౌన్ సమయంలో పలు చిత్రాలు మరియు సిరీస్ ల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో నేడు మేము ఎంచుకున్న చిత్రం “బుచ్చిబాబు కండ్రిగ”. మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా లో విడుదల కాబడిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

చిత్తూరు జిల్లాకు చెందిన బుచ్చినాయుడు కండ్రిగ అనే ఒక చిన్న కుగ్రామంలో బాలు(మున్నా), స్వప్న(దృషిక) అనే అమ్మాయిని తన చిన్న వయసు నుంచే ప్రేమిస్తాడు. అలాగే కొన్నాళ్ల తర్వాత స్వప్న కూడా అతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. కానీ ఈ విషయం ఆమె తండ్రికి తెలిసిపోతుంది తన కూతురు ఇలా ఒకడిని ప్రేమించడం ఇష్టం లేని తండ్రి వారిని ఏం చేసాడు? వారి ప్రేమ ఏమయ్యింది? అన్నదే ఈ పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కిన సినిమాలో అసలు కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో హీరోగా నటించిన మున్నా మంచి నటన కనబర్చాడు ఒక్కో ఏజ్ గ్రూప్ లో అందుకు తగ్గట్టుగా కనిపించి మంచి నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే హీరోయిన్ దృషిక కూడా చాలా నీట్ గా తన రోల్ ను పోషించింది. అలాగే చివరి అరగంటలో ఈమె నటనను మెచ్చుకొని తీరాల్సిందే. అలాగే హీరో తండ్రిగా కేరాఫ్ కంచరపాలెం లాంటి ఫీల్ గుడ్ చిత్రంలో నటించిన సుబ్బారావు మంచి పెర్ఫామెన్స్ ను ఇచ్చారు. ముఖ్యంగా అతనికి కొడుకుకు తనకి మధ్యలో ఉన్న సన్నివేశాల్లో అయితే చాలా బాగా నటన కనబరిచారు.

ఇక అలాగే ఈ పీరియాడిక్ డ్రామాకు మరో మంచి అసెట్ గా నిలిచినా నటుడు బుల్లితెర నటుడు రవి వర్మ. ఎన్నో సినిమాలు సీరియల్స్ లో నటించిన ఇతను హీరోయిన్ తండ్రిగా అద్భుతమైన అవుట్ ఫుట్ ను ఇచ్చారు. తండ్రిగా ఇవ్వాల్సిన ఎమోషన్స్ అన్నిటిని చాలా బాగా ప్రెసెంట్ చేసి సినిమాకు మరింత ప్లస్ అయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి అండర్ రేటెడ్ నటులకు ఇలాంటి పాత్రలు రావడం మంచి విషయం అని చెప్పాలి. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంటుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రానికి అతి పెద్ద మైనస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా కథే అని చెప్పాలి. ఎందుకంటే ఈ స్టోరీ లైన్ చాలా పాతది మరియు అందరికీ తెలిసినదే కావడం మూలాన ప్రేక్షకులకు ఒక పీరియాడిక్ లవ్ స్టోరీని చూస్తున్నా చాలా రొటీన్ గా అనిపిస్తుంది. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించడం దానికి అమ్మాయి తండ్రి అడ్డుపడడం అనేది చాలా పాత అంశమే. ఒక్క క్లైమాక్స్ లోని 10 నిమిషాలు తప్ప మిగతా అంతా ఏమంత ఆసక్తికరంగా ఉండదు.

అలాగే చాలా సన్నివేశాలను ఆవిష్కరించడంలో దర్శకుడు చాలా సమయాన్ని తీసుకొని నెమ్మదిగా సాగించినట్టు అనిపిస్తుంది. అందువల్ల ఒకింత బోర్ కూడా కొడుతుంది. హీరో మరియు హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ కు ఎక్కువ సమయం తీసుకున్నా దానిని సద్వినియోగించుకోలేకపోయారు. అలాగే ఆ గ్రామంలో జరిగే ఎపిసోడ్ విలన్ ట్రాక్స్ అంతా చాలా రొటీన్ గా ఏమంత గొప్పగా అనిపించవు.

 

సాంకేతిక విభాగం :

 

ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక విభాగాన్ని మాత్త్రం మెచ్చుకొని తీరాలి. నిర్మాణ సంస్థ అందించిన నిర్మాణ విలువలు కానీ ఆ గ్రామంలో చూపించిన విజువల్స్ కానీ చాలా నాచురల్ గా అనిపిస్తాయి. అలాగే మిహిరామ్స్ అందించిన సాంగ్స్ కానీ బాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగున్నాయి. అలాగే ఆ పాటలను తెరకెక్కించిన విధానానికి కూడా మంచి మార్కులు వెయ్యొచ్చు. కానీ ఎడిటింగ్ విసయంలో కొంచెం జాగ్రత్త వహించి కొన్ని అనవసర సన్నివేశాలను తీసేస్తే బాగుండేది.

ఇక దర్శకుడు కృష్ణ విషయానికి వస్తే ఈ చిత్రంలో అతని టేకింగ్ కానీ ఎంచుకున్న పాత్రలు వారి నుంచి రాబట్టిన పెర్ఫామెన్స్ లు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు ఇది మంచి విషయం. కానీ ఎంచుకున్న కథా నేపథ్యంలో కొత్తదనం ఉండి ఉంటే అతని దర్శకత్వానికి మరింత ప్లస్ అయ్యి ఉండేది. కానీ బాగా రొటీన్ అంశం కావడం వలన ఈ చిత్రంపై అంత ఆసక్తి కలగకపోవడం బాధాకరం. ఈ విషయంలో దర్శకుడు జాగ్రత్తలు వహించి ఉంటె బాగుండేది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “బుచ్చిబాబు కండ్రిగ” అనే చిత్రం చాలా రొటీన్ కథాంశంతో నెమ్మదిగా సాగే ఊహించగలిగే సన్నివేశాలతో కూడిన పీరియాడిక్ డ్రామా. కేవలం నటీనటుల పెర్ఫామెన్స్ మరియు విజువల్స్ క్లైమాక్స్ లో ఒక పది నిమిషాల ఎపిసోడ్ మినహాయిస్తే సరైన కథా నేపథ్యం లేకపోవడం వల్ల ఈమంత్ర గొప్పగా అనిపించదు. పైగా నెమ్మదిగా బోర్ గా సాగుతున్నట్టు బిలో యావరేజ్ గా అనిపిస్తుంది.

123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు