‘పెద్ది’ దెబ్బ.. బుచ్చిబాబుకి యూనానిమస్ రెస్పాన్స్

‘పెద్ది’ దెబ్బ.. బుచ్చిబాబుకి యూనానిమస్ రెస్పాన్స్

Published on Apr 6, 2025 10:00 PM IST


ఇప్పుడు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో వినిపిస్తున్న సినిమా పేరు “పెద్ది”. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ షాట్ ఇపుడు భారీ రెస్పాన్స్ ని అందుకుంది. అయితే ఈ సినిమాపై మొదటి నుంచీ మంచి బజ్ ఉంది కానీ అది మాత్రం ఇపుడు సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ తో తారా స్థాయికి వెళ్ళింది అని చెప్పవచ్చు.

మరి ఇందులో సగం క్రెడిట్ గ్లోబల్ స్టార్ ది అయితే మిగతా క్రెడిట్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ బుచ్చిబాబు సానాకే అని అంతా అంటున్నారు. తన టేకింగ్ మాస్ విజువల్స్ చూసి మెగా ఫ్యాన్స్ సహా మిగతా టాలీవుడ్ ఆడియెన్స్ సైతం షాకయ్యారు. దీనితో దర్శకుడు బుచ్చిబాబు విషయంలో కూడా యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ని తాను అందుకోవడం విశేషం. ఇక ఫుల్ లెంగ్త్ సినిమా విషయంలో బుచ్చిబాబు వర్క్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే ఏడాది మార్చ్ 27 వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు