ఆర్ ఆర్ ఆర్ సెట్స్ కూడా అదే స్థాయిలో..!

Published on Jun 4, 2020 3:00 am IST


రాజమౌళి ప్రణాళికలు మొత్తం మార్చివేసింది కరోనా లాక్ డౌన్. ఆయన ఆర్ ఆర్ ఆర్ కోసం అద్భుత లొకేషన్స్ ఎంపిక చేసుకొని పెట్టుకున్నారు. ఐతే ఇప్పుడు ఆయన ఎంచుకున్న లొకేషన్స్ లో షూటింగ్ చేయడానికి వీలు లేని పరిస్థితి. కనీసం రాష్ట్రం దాటి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన భారీ సెట్స్ వేసి హైదరాబాదులోనే అత్యధిక షూటింగ్ పూర్తి చేయాలని నిశ్చయించుకున్నారు

కాగా ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కోసం ఓ భారీ సెట్ రాజమౌళి వేయిస్తున్నాడు. ఈ సెట్ ఖరీదు దాదాపు 20కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. భారీ సినిమా కొసవడంతో అందుకు తగ్గట్టే భారీ నిర్మాణ వ్యయంతో ఈ సెట్స్ వేస్తున్నారు. డి వి వి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :