ప్రైమ్ వీడియోలో “బుజ్జి & భైరవ” సెన్సేషన్!

ప్రైమ్ వీడియోలో “బుజ్జి & భైరవ” సెన్సేషన్!

Published on Jul 23, 2024 1:00 AM IST

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898ఎడి చిత్రం వరల్డ్ వైడ్ గా వెయ్యి కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు సాధించి, సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కల్కి ప్రపంచాన్ని మరింత అర్థమయ్యేలా చేయడానికి మేకర్స్ బుజ్జి అండ్ భైరవ అనే పేరుతో ఒక చిన్న వెబ్ సిరీస్‌ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేసారు. సినిమా థియేటర్లలో విడుదల చేయడానికి ముందు ఈ యానిమేటెడ్ సిరీస్ విడుదల అయ్యింది.

అయితే 2024 సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రైమ్ వీడియోలో అత్యధికంగా వీక్షించిన తెలుగు షో బుజ్జి అండ్ భైరవ సిరీస్ అని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ యానిమేషన్ సిరీస్‌కు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, కమల్ హాసన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు