‘బుల్లెట్ సత్యం’ టైటిల్, లిరికల్ వీడియో సాంగ్ విడుదల

‘బుల్లెట్ సత్యం’ టైటిల్, లిరికల్ వీడియో సాంగ్ విడుదల

Published on Nov 25, 2020 10:00 AM IST

సాయితేజ ఎంటర్టైన్మెంట్ పతాకం పై దేవరాజ్, సోనాక్షి వర్మ హీరో, హీరోయిన్ లుగా మదుగోపు దర్శకత్వంలో దేవరాజ్ నిర్మిస్తున్న ‘బుల్లెట్ సత్యం’ చిత్రం యొక్క టైటిల్, లిరికల్ వీడియో సాంగ్ ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో విడుదల చేసారు
.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత రాజకందుకూరి,డైరెక్టర్ వీర శంకర్, దేవి ప్రసాద్, సంజయ్ రెడ్డి లు చిత్రం యొక్క లిరికల్ సాంగ్ విడుదల చేసారు అనంతరం …

ముఖ్య అతిధి గా వచ్చిన. ప్రముఖ డైరెక్టర్ వీరశంకర్ మాట్లాడుతూ… ఈ సినిమా టైటిల్ చాలా పాజిటివ్ గా ఉంది. ఈ చిత్రానికి రాంబాబు గారు చక్కటి సాహిత్యాన్ని అందించారు..మంచి సినిమాలకు మంచి లిరిక్ రైటర్ ఎంతో అవసరం…దేవరాజ్ గారు కరోనా టైం లో ముందుకు వచ్చి చిత్రాన్ని నిర్మించడమే కాక హీరోగా నటించారు.ఇలాంటి వారు ఇండస్ట్రీ కు ఎంతో అవసరం..డైరెక్టర్ మధు కు ఇది రెండవ చిత్రం..హీరోయిన్ గా చేసిన సోనాక్షి కి అల్ ద బెస్ట్ అని చెప్పారు…

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ…”టైటిల్ చాలా క్యాచీ గా ఉంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ కథ..పాయింట్ బాగుండి రీజనబుల్ టేకింగ్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా” ఆదరిస్తారు.

సంజయ్ రెడ్డి మాట్లాడుతూ .. ‘జార్జ్ రెడ్డి’ లోని బుల్లెట్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఈ బుల్లెట్ సత్యం కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని అన్నారు..

చిత్ర నిర్మాత, హీరో దేవరాజ్ మాట్లాడుతూ .. “ఈ చిత్రం యొక్క కథ విలేజ్ బ్యాక్ డ్రాప్ సాగుతుంది..నేను ఈ చిత్రం లో మొదటిసారిగా హీరో గా నటించాను.మీరందరూ నన్ను ఆదరించి ఈ సినిమాను హిట్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
హీరోయిన్ సొనాక్షి వర్మ మాట్లాడుతూ .. నా పేరు సోనాక్షి వర్మ నేను ఇండస్ట్రీ కు వచ్చి నాలుగు సంవత్సరాలు అయ్యింది..నేను యాడ్ లు, షాట్ ఫిలిమ్స్ లో నటించాను..నా గ్రాడ్యుయేషన్ పూర్తి అయింది..నాకు తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. నన్ను గుర్తించి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ,దర్శక,నిర్మాత లకు నా కృతజ్ఞతలు.

డైరెక్టర్ మధు మాట్లాడుతూ .. “ఇది నాకు రెండవ చిత్రం..విలేజ్ బ్యాక్ డ్రాప్ కథ ఈ చిత్రం లోని సాంగ్స్ అన్ని బాగుంటాయి..వచ్చే నెల సినిమా థియేటర్లు ఓపెన్ అయితే గ్రాండ్ రిలీజ్ చేద్దామని చూస్తున్నాము..లేదా att ద్వారా రిలీజ్ చేద్దామని” అనుకుంటున్నాము. ఈ చిత్రం ఎక్కడా కూడా సినిమా టిక్ గా ఉండదు..రియాలిస్టిక్ గా ఉంటుంది..ఈ చిత్రం లో హీరో, హీరోయిన్లు చక్కగా నటించారు..ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్లందరికీ కృతజ్ఞతలు..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు