రామ్ పోతినేని హీరోగా డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ది వారియర్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రం లో రామ్ సరసన హీరోయిన్ గా కృతి శెట్టి నటించడం జరిగింది. ఈ చిత్రం లోని బుల్లెట్ సాంగ్ కి ప్రేక్షకుల్లో, అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది.
అయితే తాజాగా చిత్ర యూనిట్ బుల్లెట్ ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేయడం జరిగింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం లో ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.