“పుష్ప 2 ది రూల్” కి బాగా ప్లస్ అవుతున్న బన్నీ మ్యానరిజం!

“పుష్ప 2 ది రూల్” కి బాగా ప్లస్ అవుతున్న బన్నీ మ్యానరిజం!

Published on May 14, 2024 3:00 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా పుష్ప 2 ది రూల్. ఈ చిత్రం ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. పుష్ప ది రైజ్ చిత్రం కి కొనసాగింపు గా వస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలు బన్నీ మ్యానరిజం ను బాగా ఎలివేట్ చేస్తున్నాయి.

ఫస్ట్ పార్ట్ లో ఈ మ్యానరిజం తో దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు అదే తరహాలో ప్రమోషన్స్ ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప పుష్ప సాంగ్ లో సిగ్నేచర్ స్టెప్ మరియు అస్సలు తగ్గేదేలే అనే డైలాగ్ దీనికి ఉదాహరణ అని చెప్పాలి. ఈ చిత్రం లో ఇంకా మరెన్ని ఆడియెన్స్ ను అలరించనున్నట్లు తెలుస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు