ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిపోయాడు. ఆయన నటించిన ‘పుష్ప-2’ వచ్చేవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో దర్శకుడు సుకుమార్, బన్నీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ క్రియేట్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను ప్రస్తుతం శరవేగంగా నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో కేరళలో ఈ చిత్ర ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఇక కేరళలో పుష్ప క్రేజ్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత బన్నీ వాస్, అల్లు అర్జున్ సిగ్నేచర్ మార్క్ AA ని ఉంగురం రూపంలో తన చేతికి పెట్టుకున్న ఫోటోను సోషల్ మీడయియాలో పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ అనేది పేరు కాదని… ఓ బ్రాండ్ అనే అర్థం వచ్చేలా ఈ ఫోటోకు ఆయన క్యాప్షన్ ఇచ్చారు.
The emblem for hardwork.. focus .. dedication @alluarjun #Pushpa2TheRule pic.twitter.com/lfDUB5jtdD
— Bunny Vas (@TheBunnyVas) November 27, 2024