మహేష్ బాబు ఫౌండేషన్ కి “బిజినెస్‌మెన్” 4కె వసూళ్లు!

మహేష్ బాబు ఫౌండేషన్ కి “బిజినెస్‌మెన్” 4కె వసూళ్లు!

Published on Aug 11, 2023 8:00 PM IST

టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా బిజినెస్‌మ్యాన్ చిత్రాన్ని అభిమానులు థియేటర్ల లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేయడం జరిగింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రీ రిలీజ్ కి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి గతేడాది రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని ఆకట్టుకుంది. ఇప్పుడు అదే విధంగా బిజినెస్‌మ్యాన్ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం వసూళ్లలో ఆల్ టైమ్ రికార్డు ను క్రియేట్ చేయడం జరిగింది. 5.31 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేయడం జరిగింది.

మహేష్ బాబు రేంజ్, ఫ్యాన్ పవర్ ఈ చిత్రం సాధించిన వసూళ్లతో మరోసారి రుజువైంది. అయితే ఈ సినిమా రీ రిలీజ్ కి వచ్చిన వసూళ్లను మహేష్ బాబు ఫౌండేషన్ కి విరాళం గా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. హార్ట్ ఆపరేషన్ లకు, అర్హులైన స్కూల్ పిల్లలకు స్కాలర్ షిప్స్ అందించడానికి ఈ విరాళాలు సహాయ పడనున్నాయి. మహేష్ బాబు కి తగిన విధంగా ఫ్యాన్స్ అదే అడుగు జాడల్లో నడవడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ నటించిన బిజినెస్‌మ్యాన్ చిత్రం మహేష్ క్రేజ్ ఏ పాటిదో చెప్పకనే చెబుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు