సూర్య “కంగువా” వాయిదా పడిందా? కొత్త డేట్

సూర్య “కంగువా” వాయిదా పడిందా? కొత్త డేట్

Published on Aug 25, 2024 9:56 PM IST

ప్రస్తుతం మన సౌత్ నుంచి రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు శివ తెరకెక్కించిన భారీ విజువల్ అండ్ యాక్షన్ డ్రామా “కంగువా” కూడా ఒకటి. మరి ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా మేకర్స్ ప్లాన్ చేయగా ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ కి సిద్ధం చేశారు. అయితే ఈ సినిమాని ఎంతో కాలం అవైటెడ్ గా ఉంచి అక్టోబర్ 10 డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ తర్వాత తలైవర్ “వేట్టైయన్” ని అనౌన్స్ చేశారు.

దీనితో భారీ క్లాష్ కన్ఫర్మ్ అయ్యింది. కానీ ఇప్పుడు అప్డేట్ ఏమిటంటే ఈ క్లాష్ నుంచి కంగువా తప్పుకుంటుంది అని స్ట్రాంగ్ బజ్ మొదలైంది. దీనితో సూర్య సినిమా అక్టోబర్ 10 నుంచి తప్పుకొని అదే నెల 31 కి షిఫ్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి కారణం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న టైం కి పూర్తి కాకపోవడమే అన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు