పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీకి అన్ని ఏరియాల్లో కూడా బాగానే కలెక్షన్స్ లభిస్తున్నారు. ఇక మరోవైపు యువ దర్శకుకుడు నాగ అశ్విన్ తో కల్కి 2898 ఏడి అలానే మారుతీతో మరొక మూవీ చేస్తున్నారు ప్రభాస్.
విషయం ఏమిటంటే, వేగంగా హాలీవుడ్ రేంజ్ టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కుతోన్న కల్కి 2898 ఏడి మూవీ యొక్క రిలీజ్ ని పాన్ ఇండియన్ కి మించే పాన్ వరల్డ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ముఖ్యంగా ఇంగ్లీష్ తో పాటు పలు ఇతర విదేశీ భాషల్లో కూడా ఈ మూవీ రిలీజ్ అవుతుందట.
కాగా ఈ మూవీని వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చే అవకాశం కనపడుతోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీని వైజయంతి మూవీస్ సంస్థ పై సి అశ్వినీదత్ నిర్మిస్తుండగా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దిశా పటాని, కమల్ హాసన్ ఇందులో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.