బజ్ : కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ నుండి తప్పుకున్న మరొక నటుడు ?

బజ్ : కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ నుండి తప్పుకున్న మరొక నటుడు ?

Published on Mar 24, 2024 3:01 AM IST

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ భారీ యాక్షన్ డ్రామా మూవీ థగ్ లైఫ్. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్, పోస్టర్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి ఇంట్రెస్ట్ ని ఏర్పరిచాయి.

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. విషయం ఏమిటంటే, కొన్నాళ్ల క్రితం ఈ మూవీ నుండి యువ నటుడు దుల్కర్ సల్మాన్ డేట్స్ ఇష్యూ కారణంగా తప్పుకోగా తాజాగా మరొక నటుడు జయం రవి కూడా ఈ ప్రాజక్ట్ నుండి షెడ్యూల్స్ సమస్యల కారణంగా తప్పుకున్నట్లు చెప్తున్నారు.

ఇక ఈ మూవీ యొక్క లేటెస్ట్ షెడ్యూల్ సెర్బియా లో ప్లాన్ చేయగా దర్శకుడు మణిరత్నం సహా ఇతర టీమ్ సభ్యులు అక్కడికి పయనమై వెళ్లారు. అయితే కమల్ హాసన్ కొన్ని కారణాల వలన రాలేకపోవడం వలన ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. మొత్తంగా ఈ ఇద్దరు నటులు థగ్ లైఫ్ నుండి తప్పుకోవడంతో వారి స్థానంలో వేరొకరిని తీసుకెందుకు టీమ్ వెతుకులాట ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో అభిరామి, నాజర్, గౌతం కార్తీక్, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు