అల్లు అర్జున్ కొత్త చిత్రం ప్రకటన వచ్చేది ఆరోజే..?

అల్లు అర్జున్ కొత్త చిత్రం ప్రకటన వచ్చేది ఆరోజే..?

Published on Mar 29, 2025 8:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ ఇప్పటికే పూర్తయ్యాయని.. ఈ సినిమాను త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ సినిమా అనౌన్స్‌మెంట్ ఎప్పుడనేదాని పై తాజాగా ఓ డేట్ కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అల్లు అర్జున్ కెరీర్‌లో 22వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను దర్శకుడు అట్లీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను ఏప్రిల్ 8న చేయబోతున్నట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని చిత్ర వర్గా్ల్లో టాక్.

ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారట. మరి నిజంగానే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ బన్నీ బర్త్ డే ట్రీట్‌గా రానుందా.. అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు