ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే సినీ వర్గాలు కన్ఫమ్ చేశాయి. ఇక ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాజాగా ఈ సినిమా నేపథ్యం ఏమిటనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా కథ పునర్జన్మల నేపథ్యంలో రానుందని.. అందుకే ఈ సినిమాలో బన్నీ రెండు పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక టాలీవుడ్‌లో వచ్చిన మగధీర, మనం వంటి సినిమాల కథ మాదిరి ఈ మూవీ కూడా ఉండబోతుందని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాను ఫైనల్ చేశారని.. త్వరలోనే ఈ మూవీని అఫీషియల్‌గా లాంచ్ చేస్తారనే టాక్ టాలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది.