ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప 2 – ది రూల్’ ఇండియన్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తనదైన మార్క్‌తో తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక అల్లు అర్జున్ మరోసారి తన నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించాడు. అన్ని విధాలుగా ఈ సినిమా పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌గా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ సెన్సేషనల్ రన్ కొనసాగించింది. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో పుష్పరాజ్ రఫ్ఫాడించాడు.
అయితే, ఇప్పుడు అందరూ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ గురించి చర్చించుకుంటున్నారు. పుష్పరాజ్ మార్క్ లేకుండా అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. బన్నీ తన నెక్స్ట్ మూవీని త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేయనున్నాడు. త్రివిక్రమ్ గ్రాఫ్‌లో ఇప్పటివరకు పాన్ ఇండియా మూవీ లేదు. దీంతో ఈ సినిమాతో అల్లు అర్జున్ పుష్ప రాజ్ బ్రాండ్ కాకుండా ఎంతమేర వసూళ్లను రాబట్టగలడు అనేది ఆసక్తికరంగా మారింది. మరి పుష్పరాజ్ బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసిన సెన్సేషన్‌తో పోలిస్తే అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీతో ఎంతమేర వసూళ్లు రాబడతాడో చూడాలి.