టాలీవుడ్‌లో హిట్ మెషిన్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించే దిశగా ఈ మూవీ వెళ్తోంది. ఇక ఈ సినిమా అందుకున్న భారీ సక్సెస్ తర్వాత, ఇప్పుడు అందరి చూపులు అనిల్ రావిపూడి నెక్స్ట్ చేయబోయే మెగాస్టార్ మూవీ పై పడింది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్స్ శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో సినిమాలు చేయనున్నాడు చిరు. అయితే, అనిల్ రావిపూడి వెంకటేష్ లాంటి సీనియర్ హీరోకి ఇంతటి భారీ విజయాన్ని అందించడంతో, మెగాస్టార్ కోసం కూడా అలాంటి కథను రెడీ చేసి ఖచ్చితంగా హిట్ చేయగలడని అభిమానులు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి తనకున్న డిమాండ్ మేరకు రెమ్యునరేషన్ కూడా పెంచినట్టు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవితో సినిమాకు అనిల్ రావిపూడి తన రెమ్యునరేషన్‌గా రూ.25 కోట్లు డిమాండ్ చేస్తున్నారని.. దీనికి చిత్ర నిర్మాత సాహు గారపాటి కూడా ఓకే చెప్పినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక మెగాస్టార్‌తో అనిల్ రావిపూడి మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.