టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస్ దిల్ రాజు ఈ సంక్రాంతికి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలను దిల్ రాజు ప్రొడ్యూస్ చేశారు. అయితే, గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాప్ అవగా, సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
ఇక ఇప్పుడు అందరూ దిల్ రాజు నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తారా అనే అంశంపై చర్చించుకుంటున్నారు. ఏ డైరెక్టర్‌తో ఆయన సినిమా చేస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే, సినీ సర్కిల్స్‌లో ఈ విషయంపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలోనే కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేసేందుకు దిల్ రాజు ఆసక్తిని చూపుతున్నాడని.. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా రావచ్చనే టాక్ జోరుగా వినిపిస్తోంది.
మరి నిజంగానే దిల్ రాజు తన నెక్స్ట్ మూవీని తెలుగు డైరెక్టర్స్‌తో కాకుండా కన్నడ డైరెక్టర్‌తో తెరకెక్కిస్తాడా.. అనేది తెలియాల్సి ఉంది.