టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం కూడా ఒకటి. దర్శకుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పీరియాడిక్ వార్ లవ్ స్టోరీగా రానుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది.
అయితే, ఈ సినిమాకు దర్శకుడు హను రాఘవపూడి ఓ బాలీవుడ్ చిత్రం నుంచి ఇన్‌స్పైర్ అయినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన ‘వీర్ జారా’ చిత్రంలో హీరోయిన్ ప్రేమ కోసం హీరో బందీగా మారుతాడు. ఆ సినిమాకు ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ అందించారు. ఇప్పుడు ఇదే తరహా స్టోరీలైన్‌ను హను రాఘవపూడి ఫౌజీ చిత్రానికి తీసుకున్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్ ప్రేమ కోసం ఓ సైనికుడు ఖైదీగా ఎలా మారాడు అనేది ఫౌజీ చిత్ర కథగా మనకు చూపెట్టబోతున్నారట. ఇక ఈ సినిమాలో అందాల భామ ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుంది. మరి ఈ సినిమా కథ నిజంగానే బాలీవుడ్ చిత్రం నుంచి ఇన్‌స్పైర్ అయ్యిందా అనేది చూడాలి.