‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ హీరో చరణ్ కాదా..?

‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ హీరో చరణ్ కాదా..?

Published on Jan 4, 2025 3:00 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కావడంతో ఒక్కసారిగా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాతో దర్శకుడు శంకర్ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ కొట్టేందుకు గట్టిగా ఫిక్స్ అయినట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

‘గేమ్ ఛేంజర్’ మూవీలో రామ్ చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాను తొలుత తమిళ స్టార్ హీరో విజయ్ చేయాల్సి ఉందట. ఈ సినిమా కథను దర్శకుడు శంకర్ ముందు విజయ్‌కు వినిపించాడట. అయితే, కథ నచ్చినా కూడా విజయ్ ఈ సినిమాకు ఎందుకో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆ తర్వాత నిర్మాత దిల్ రాజు ద్వారా ఈ చిత్ర కథను రామ్ చరణ్‌కు వినిపించాడట దర్శకుడు శంకర్.

చరణ్ ఈ సినిమాకు ఓకే చెప్పడంతో ‘గేమ్ ఛేంజర్’ పట్టాలెక్కిందని తెలుస్తోంది. పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా ఎస్.జె.సూర్య, అంజలి, శ్రీకాంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు