టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్లు అభిమానులను అమితంగా ఆకట్టుకుంటాయి. అలాంటి వారిలో దర్శకుడు హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కూడా ఒకటి. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘గబ్బర్‌సింగ్’ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో మనం చూశాం. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా కూడా రానుంది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు దర్శకుడు హరీష్ శంకర్ ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా ఇప్పట్లో షూటింగ్ జరుపుకోవడం కష్టంగా కనిపిస్తుంది. దీంతో ఈ డైరెక్టర్ ఇప్పుడు మరో స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.
నందమూరి బాలకృష్ణతో గత కొంత కాలంగా హరీష్ శంకర్ ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడని.. ఈ సినిమా కథను ఆయన ఇప్పటికే రెడీ చేసిపెట్టాడని.. ఒక్కసారి బాలయ్యతో ఓకే అనిపించుకుంటే, పవన్ సినిమాను ప్రారంభించే లోపు బాలయ్యతో సినిమాను ముగించాలని హరీష్ శంకర్ భావిస్తున్నాడట. అటు పవన్ కళ్యాణ్ కూడా తాను నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’, ‘ఓజి’ చిత్రాలను ముందుగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. దీంతో త్వరలోనే బాలయ్య-హరీష్ శంకర్ల కాంబో ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉందని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.