బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇటీవల ‘దేవర’ చిత్రంతో టాలీవుడ్లో సాలిడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సక్సెస్‌తో తన నెక్స్ట్ మూవని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి చేయనుంది. అయితే, ఇప్పుడు ఈ బ్యూటీ మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించనుందనే టాక్ వినిపిస్తోంది.
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’ త్వరలోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం చైతూ తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని నాగచైతన్య ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత ఓ సింపుల్ లవ్ స్టోరీలో నటించాలని చైతూ భావిస్తున్నాడట. దీనికోసం దర్శకుడు శివ నిర్వాణ ఇప్పటికే ఓ కథను కూడా సిద్ధం చేశాడని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా కోసం హీరోయిన్గా జాన్వీ కపూర్‌ని సెలెక్ట్ చేయాలని శివ నిర్వాణ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో చైతూతో కలిసి శివ నిర్వాణ ‘మజిలీ’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించాడు. దీంతో ఈ కాంబినేషన్లో సినిమా సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఈ కాంబినేషన్లో సినిమా సెట్ అవుతుందో లేదో వేచి చూడాలి.