టాలీవుడ్‌లో గతకొంత కాలంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘బలగం’ వేణు డైరెక్షన్‌లో తెరకెక్కబోయే నెక్స్ట్ మూవీ ఏమిటని. ఇప్పటికే తన నెక్స్ట్ మూవీ విషయంలో క్లారిటీగా ఉన్నాడు ఈ డైరెక్టర్. ‘ఎల్లమ్మ’ అనే ఓ ప్యూర్ తెలంగాణ నేపథ్యంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు వేణు.
ఇక ఈ సినిమాలో నితిన్ హీరోగా ఫిక్స్ అయ్యాడు. అయితే, హీరోయిన్‌గా తొలుత సాయి పల్లవి పేరును ఫిక్స్ చేసుకున్నారు చిత్ర యూనిట్. కానీ, కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ప్లేస్‌లో మరో స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ ఈ సినిమాకు ఓకే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఒకవేళ నిజంగానే కీర్తి ఈ సినిమాకు ఓకే చెబితే, నితిన్‌తో రెండో చిత్రంగా ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి నిజంగానే ఈ సినిమాలో కీర్తి ఫిక్స్ అయిందా లేదా అనేది చూడాలి.