గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో చరణ్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
కాగా, చరణ్ ఈ మధ్యలో ఓ క్రేజీ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ సర్కిల్స్‌లో ఓ టాక్ వినిపిస్తోంది. తమిళ హీరో కమ్ డైరెక్టర్ ధనుష్‌తో చరణ్ చేతులు కలపబోతున్నాడట. సార్, రాయన్ వంటి సినిమాలతో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక ప్రస్తుతం కుబేర చిత్రంలో ఆయన నటిస్తున్నాడు. ఇక తన దగ్గర ఉన్న ఓ సాలిడ్ కథను చరణ్‌కు వినిపించాడని.. దీనికి చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సినీ సర్కిల్స్‌లో ఓ బజ్ వినిపిస్తోంది.
ఈ కాంబినేషన్ గనక నిజంగా సెట్ అయితే, ఇది టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. మరి నిజంగానే ధనుష్‌తో చరణ్ సినిమా చేస్తాడా లేదా.. అనేది తెలియాల్సి ఉంది.