రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కింగ్‌డమ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ కథతో ఈ మవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాడు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియోకు సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త జోరుగా వినిపిస్తుంది. ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలో ఆయన విజయ్ దేవరకొండకు సోదరుడి పాత్రలో నటిస్తున్నాడని.. ఈ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉండబోతుందని తెలుస్తోంది.
మరి నిజంగానే ఈ సినిమాలో సత్యదేవ్ చేయబోయే పాత్ర ఇదేనా అనిద తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.