హీరో సిద్ధార్థ్ నటించిన రీసెంట్ మూవీ ‘మిస్ యు’ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను డిసెంబర్ 13న మంచి బజ్‌తో రిలీజ్ చేశారు. అయితే, ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ లేకపోవడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్‌గా నిలిచింది. దర్శకుడు ఎన్.రాజశేఖర్ తెరకెక్కించిన ఈ మూవీలో అందాల భామ ఆషికా రంనాథ్ హీరోయిన్‌గా నటించింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘మిస్ యు’ చిత్రం జనవరి 26 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ్, తెలుగు భాషల్లో ఒకేసారి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రావచ్చట. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. మరి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.