టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. ఆమె ప్రస్తుతం హీరో నితిన్ సరసన ‘రాబిన్‌హుడ్’, మాస్ రాజా రవితేజ సరసన ‘మాస్ జాతర’ చిత్రాల్లో నటిస్తోంది. దీంతో ఈ బ్యూటీ బాక్సాఫీస్ దగ్గర వరుస విజయాలను అందుకోవడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇక శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో కలిసి శ్రీలీల ఓ సినిమా చేయనుంది. ఈ సినిమాను త్వరలోనే ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పుడు శ్రీలీల మరో బాలీవుడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ నెక్స్ట్ మూవీలో హీరోయిన్‌గా శ్రీలీల నటించబోతుందని బీ-టౌన్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా తన మొదటి సినిమా మొదలు కాకుండానే, రెండో సినిమాకు ఓకే చెప్పడంతో శ్రీలీల టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మరి నిజంగానే శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ చిత్రాల్లో నటించనుందా.. అనేది చూడాలి.