సన్నీ కోసం సన్నీ.. గోపీచంద్ ప్లాన్ మామూలుగా లేదుగా!

సన్నీ కోసం సన్నీ.. గోపీచంద్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Published on Oct 21, 2024 11:08 PM IST

టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్టర్‌గా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘జాట్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటంతో ‘జాట్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు గోపీచంద్ తెరకెక్కిస్తు్న్నాడు. అయితే, ఈ సినిమాలో ఓ స్టార్ బ్యూటీ నటించబోతుందని.. అంతేగాక, ఓ హాట్ స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ కూడా చేయబోతుందని తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుందని.. ఓ స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ కూడా చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో ఈ సినిమాలో సన్నీ కోసం సన్నీ వస్తోందని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రెజీనా క్యాసాండ్రా, సయ్యామీ ఖేర్ ఫీమేల్ లీడ్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యా్క్టరీ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు