ఆ రెండు ప్రాజెక్ట్స్ నుండి నిర్మాతలు తప్పుకున్నారా..?

ఆ రెండు ప్రాజెక్ట్స్ నుండి నిర్మాతలు తప్పుకున్నారా..?

Published on Nov 29, 2024 3:00 AM IST

టాలీవుడ్‌లో బడా చిత్రాలతో పాటు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను అందించాలని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రయత్నిస్తుంటుంది. అయితే, ఈ బ్యానర్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌ని తెరకెక్కిస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న ఈ నిర్మాణ సంస్థ మరో రెండు కొత్త ప్రాజెక్ట్స్‌ని కూడా లైన్‌లో పెట్టింది.

అయితే, విశ్వంభర చిత్రాన్ని తొలుత సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. కానీ, ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడటంతో నిర్మాతలు నిరాశకు లోనయ్యారనే టాక్ వినిపిస్తోంది. అంతేగాక, ఈ సినిమా డీల్స్ కూడా ఇంకా క్లోజ్ కాలేదని.. దీంతో నిర్మాతలు మరింత అసంతృప్తిగా ఉన్నారని సినీ సర్కిల్స్‌లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వారు తెరకెక్కించబోయే మరో రెండు ప్రాజెక్ట్స్ నుండి బయటకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

మ్యాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా నుండి యూవీ క్రియేషన్స్ తప్పుకుందట. దీంతో పాటు వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో రాబోయే సినిమాను కూడా యూవీ క్రియేషన్స్ వదులుకుందని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే యూవీ క్రియేషన్స్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు