టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం VD12 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాలో విజయ్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విజయ్ లుక్ ఎలా ఉండబోతుందా రివీల్ చేశారు మేకర్స్. దీంతో ఈ సినిమా నుంచి మరో అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా, ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాకు ‘సామ్రాజ్యం’ అనే టైటిల్ పెట్టినట్లుగా సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే, ఇప్పుడు ఈ మూవీ అప్డేట్‌ను ఫిబ్రవరి 7న రివీల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి నిజంగానే ఈ సినిమాకు సామ్రాజ్యం టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేస్తారా.. లేక వేరొక టైటిల్‌తో VD12 అప్డేట్ రాబోతుందా.. అనేది వేచి చూడాలి.