వెంకీతో హరీష్ శంకర్ మూవీ.. ఫిక్స్ అయ్యిందా..?

వెంకీతో హరీష్ శంకర్ మూవీ.. ఫిక్స్ అయ్యిందా..?

Published on Mar 28, 2025 2:00 AM IST

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ రీసెంట్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాతో వెంకీ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్స్ట్ చిత్రాన్ని రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడట ఈ స్టార్ హీరో.

ఇప్పటికే పలువురు డైరెక్టర్స్ చెప్పిన కథలు ఆయన వింటున్నాడట. ఈ క్రమంలోనే క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఓ కథను వెంకీకి వినిపించాడట. ఈ కథ వెంకీకి నచ్చిందని.. ఆయనతో పాటు నిర్మాత సురేష్ బాబు కూడా కథను విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు వెంకీ లాక్ చేశాడని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా వెంకీ కెరీర్‌లో 77వ చిత్రంగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అఫీషియల్‌గా త్వరలోనే అనౌన్స్ చేయనున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు