గర్ల్‌ఫ్రెండ్ కోసం వాయిస్ ఓవర్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్..?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన ‘పుష్ప-2’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో రష్మిక పాత్ర సాలిడ్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక నెక్స్ట్ మూవీకి అదిరిపోయే హైప్ దక్కింది. దర్శకుడు సుకుమార్ రష్మిక నెక్స్ట్ మూవీ ‘గర్ల్‌ఫ్రెండ్’ గురించి ప్రస్తావించాడు. ఆ సినిమా టీజర్ తాను చూశానని.. అందులో రష్మిక పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అని ఆయన కొనియాడారు.

అయితే, ఇప్పుడు ‘గర్ల్‌ఫ్రెండ్’ చిత్ర టీజర్‌ని పుష్ప-2 సినిమాతో పాటు ప్లే చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ టీజర్‌లో మరో స్పెషాలిటీ కూడా ఉండబోతుందట. ఈ సినిమా టీజర్‌లో రష్మిక పాత్రను పరిచయం చేయడం, ఆ పాత్రను నెరేట్ చేయడం లాంటి సీన్స్‌కు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గతకొంత కాలంగా రష్మిక, విజయ్ దేవరకొండ రిలేషన్‌లో ఉన్నట్లుగా రీసెంట్‌గా రష్మిక ఓ ఈవెంట్‌లో క్లూ కూడా ఇచ్చేసింది.

ఇప్పుడు రష్మిక కోసం ఆమె బాయ్‌ఫ్రెండ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడనే వార్త ‘గర్ల్‌ఫ్రెండ్’ టీజర్‌పై ఆసక్తిని పెంచుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ టీజర్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక గర్ల్‌ఫ్రెండ్ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

Exit mobile version