‘పుష్ప-3’లో ఇద్దరు స్టార్స్.. నిజమైతే బాక్సాఫీస్ ర్యాంపేజ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాడు. దీంతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రికార్డులను బద్దలుకొట్టింది. ఇక ఈ సినిమాకు మరో సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ వెల్లడించడంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా, ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విలన్ పాత్రపై సరికొత్త బజ్ వినిపిస్తోంది. సుకుమార్ ఈ చిత్ర కథను మరింత పవర్‌ఫుల్‌గా రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఈ సినిమాలో ఇద్దరు విలన్లను పెట్టాలని ఆయన చూస్తున్నాడట. దీనికోసం విజయ్ దేవరకొండ, నాని పేర్లను ఆయన పరిశీలిస్తున్నాడట. ఇప్పటికే విజయ్ దేవరకొండ ఈ సినిమాలో విలన్‌గా ఉంటాడనే వార్త వైరల్ అయ్యింది. ఇప్పుడు నాని కూడా యాడ్ కావడంతో నిజంగానే సుకుమార్ ఇలాంటిది ప్లాన్ చేస్తున్నాడా అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇక పుష్ప-3 ర్యాంపేజ్‌లో బన్నీ పాత్ర ఇప్పటివరకు వచ్చిన పుష్ప, పుష్ప-2 చిత్రాలను మించి ఉండేలా సుక్కు ప్లాన్ చేస్తున్నాడట. కానీ, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. మరి నిజంగానే పుష్ప-3లో విజయ్ దేవరకొండ, నాని విలన్స్‌గా నటిస్తారా.. అనేది చూడాలి.

Exit mobile version