Pushpa 2: ఇదెక్కడి మాస్ మావా.. డేవిడ్ వార్నర్ కూడానా..?

Pushpa 2: ఇదెక్కడి మాస్ మావా.. డేవిడ్ వార్నర్ కూడానా..?

Published on Sep 19, 2024 6:00 PM IST

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప-2’ కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా యావత్ ఇండియన్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిస్తుండగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి బాక్సాఫీస్ భరతం పట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

ఈ సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చినా అభిమానులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు సైతం ఆశ్చర్యపోయే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప-2’ చిత్రం ఎంత గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను వరల్డ్ స్టాండర్డ్ కంటెంట్‌తో తీసుకొచ్చేందుకు ఆయన కష్టపడుతున్నారు. ఇందులో భాగంగా ఈ సినిమాలో పలు ఇంట్రెస్టింగ్ కేమియోలు కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది.

ఇందులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేగాక, డేవిడ్ వార్నర్‌కి సంబంధించిన ఓ స్టిల్ కూడా నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతోంది. దీంతో ‘పుష్ప-2’పై అంచనాలు అమాంతం తారాస్థాయికి చేరిపోయాయి. ఇక డేవిడ్ వార్నర్ అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన రీల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన సంగతి తెలిసిందే. మరి నిజంగానే ‘పుష్ప-2’లో డేవిడ్ వార్నర్ కేమియో సర్‌ప్రైజ్ చేస్తే, ‘‘ఇదెక్కడి మాస్ వార్నర్ మావా’’ అని అభిమానులు అనడం ఖాయం. డిసెంబర్ 6న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌కి రెడీ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు