తేజ నెక్స్ట్ మూవీకి టైటిల్ ఫిక్స్..?

టాలీవుడ్ డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ తరువాత మళ్లీ హిట్ అందుకోలేకపోయారు. దీంతో ఆయన ప్రస్తుతం కొంత గ్యాప్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని కొత్త కథలను తేజ వింటున్నాడట. ఆయన తన తనయుడిని హీరోగా పరిచయం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే తేజకు ఓ కథ నచ్చిందని, ఇది తన కుమారుడి ఎంట్రీకి పర్ఫెక్ట్‌గా సరిపోతుందని ఆయన భావిస్తున్నాడట. ఇక ఈ సినిమాకు ‘హనుమంతు’ అనే టైటిల్‌ని కూడా ఫిక్స్ చేయాలని ఆయన భావిస్తున్నాడట. ఇదొక ఫాంటెసీ కథగా ఉండనుందని టాక్.

ఈ సినిమాను కూడా లవ్ జోనర్‌లో తెరకెక్కించాలని తేజ చూస్తున్నాడట. ఈ సినిమా కోసం తేజ హోంవర్క్ స్టార్ట్ చేశారని, తన కుమారుడిని సరైన సమయంలో లాంచ్ చేస్తారని ఫిలిం సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే తేజ వీటిపై క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version