యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన ‘ఇండియన్-2’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంత దారుణమైన రెస్పాన్స్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే. దర్శకుడు శంకర్ ఈ సినిమాను తీసిన విధానంతో ఒక్కసారిగా ఫేడవుట్ అయిపోయాడని అభిమానులు విమర్శలు చేశారు. దీంతో ఆయన ఇప్పుడు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు.
ఇక ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో ‘ఇండియన్-3’ ఓ ఇంట్రెస్టింగ్ చర్చ సాగుతోంది. ‘ఇండియన్-2’ సినిమాలోనే ‘ఇండియన్-3’ మూవీపై క్లారిటీ ఇచ్చారు. నిజానికి ‘ఇండియన్-2’ రిలీజ్ సమయానికే ‘ఇండియన్-3’ షూటింగ్ కూడా పూర్తయ్యిందని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలెన్స్ ఉన్నాయని చిత్ర వర్గాలు తెలిపాయి. అయితే, ఇప్పుడు కమల్ హాసన్ ‘ఇండియన్-3’పై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆయన ఈ సినిమా కథలో కొన్ని మార్పులు చేసి, తిరిగి రీ-షూట్ చేస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని భావిస్తున్నాడట.
దీనికి చిత్ర యూనిట్ అంగీకరించి, ఆ మార్పులు చేయాలంటే శంకర్ అందుబాటులోకి వచ్చే వరకు వెయిట్ చేయాలి. మరి నిజంగానే ‘ఇండియన్-3’ మూవీ ఇప్పుడు మళ్లీ రీ-షూట్ అంటూ ట్రాక్ ఎక్కుతుందా..? అనేది వేచి చూడాలి.