బజ్… సాయి ధ‌ర‌మ్ తేజ్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్..?

బజ్… సాయి ధ‌ర‌మ్ తేజ్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్..?

Published on Jun 26, 2024 2:58 PM IST

సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌న కొత్త చిత్రాన్ని రీసెంట్ గా అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను రోహిత్ అనే కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తుండ‌గా, తేజు కెరీర్ లో 18వ చిత్రంగా ఈ మూవీ రానుంది. ఇక ఈ సినిమాను అనౌన్స్ చేయ‌గానే రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్.

ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వ‌ర్య ల‌క్ష్మీని సెలెక్ట్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. హైద‌రాబాద్ శివారులో వేసిన స్పెష‌ల్ సెట్ లో ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతోంది. ఇక ఈ సినిమా క‌థ‌ 1947 నేప‌థ్యంలో సాగ‌నున్న‌ట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ సినిమాకు మేక‌ర్స్ ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టాల‌ని చూస్తున్నార‌ట‌.

‘సంబ‌రాల ఏటి గట్టు’ అనే టైటిల్ ను ఈ సినిమాకు పెట్టాల‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది. సినిమా క‌థ‌కు ఈ టైటిల్ యాప్ట్ అవుతుంద‌ని వారు అంటున్నారు. మ‌రి నిజంగానే తేజు సినిమాకు ఇలాంటి టైటిల్ ను ఫిక్స్ చేస్తారా అనేది వేచి చూడాలి. ఇక ఈ సినిమాను ప్రైమ్ షో ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై నిరంజ‌న్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు