బ‌జ్: ‘మెరుపు’లా వ‌స్తానంటోన్న క‌ళ్యాణ్ రామ్..?

నంద‌మూరి కళ్యాణ్ రామ్ ప్ర‌స్తుతం త‌న కెరీర్ లోని 21వ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాను ప్ర‌దీప్ చిలుకూరి తెర‌కెక్కిస్తుండ‌గా, పూర్తి మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ మూవీ రానుంది. ఇక ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్ పాత్ర చాలా ప‌వ‌ర్ఫుల్ గా ఉండ‌బోతుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు.

కాగా, ఈ సినిమా టైటిల్ విష‌యంలో సినీ స‌ర్కిల్స్ లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. ఈ చిత్రానికి ‘మెరుపు’ అనే టైటిల్ ను పెట్టేందుకు మేక‌ర్స్ ఆస‌క్తిగా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ టైటిల్ తో గ‌తంలో రామ్ చ‌ర‌ణ్ ఓ సినిమాను చేయాల్సి ఉండ‌గా, కొన్ని కార‌ణాల వ‌ల్ల దాన్ని ప‌క్క‌న‌బెట్టారు.

ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ అదే టైటిల్ తో వ‌స్తాడా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక ఈ సినిమాలో లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి ఓ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. అందాల భామ సాయీ మంజ్రేక‌ర్ హీరోయిన్ గా న‌టిస్తోన్న ఈ సినిమాకు అజ‌నీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. మ‌రి ఈ సినిమాకు ‘మెరుపు’ టైటిల్ ను క‌న్ఫమ్ చేస్తారా లేక వేరొక టైటిల్ ను అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి.

Exit mobile version