Pushpa-2: ‘పుష్ప-2’ నుండి నెక్స్ట్ వచ్చే అప్డేట్ అదేనా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప-2’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుండగా ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇక ఈ సినిమాను డిసెంబర్ 6న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

కాగా, ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే, ఈసారి ఈ మూవీ నుండి రాబోయే అప్డేట్ ఏమై ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాలో విలన్‌గా భన్వర్ సింగ్ షెకావత్ అనే పాత్రలో నటిస్తున్న ఫహాద్ ఫాజిల్ లుక్‌ని రివీల్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈయన పాత్రకి సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ నిర్విరామంగా జరుపుకుంటోంది.

ఈ సీక్వెల్ మూవీలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని.. అంతే పవర్‌ఫుల్‌గా ఈ పాత్ర ఉండనుందనే కారణంతో ఈ పాత్రకు సంబంధించిన లుక్‌ని మేకర్స్ రివీల్ చేయాలని చూస్తున్నారట. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version